‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు

Feb 15,2024 12:19 #New Movies Updates

ప్రజాశక్తి-అమరావతి : వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్‌’ విడుదలకు హైకోర్టులో చుక్కెదురైంది. రేపటి వరకు సినిమా విడుదల చేయకూడదంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం తీర్పును వెలువరించింది. అదేవిధంగా సినిమాకు సంబంధించిన రికార్డులు అన్నింటిని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను హైకోర్ట్‌ రేపటికి వాయిదా వేసింది. సీఎం వైస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు సినిమాను నిర్మించారని వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

➡️