డిసెంబరు 20న ‘ది లయన్‌ కింగ్‌’ ప్రీక్వెల్‌

Apr 30,2024 20:07 #New Movies Updates

1994లో వచ్చిన ‘ది లయన్‌ కింగ్‌’ యానిమేటెడ్‌ సినిమాకు ప్రీక్వెల్‌ సిద్ధమౌతోంది. ‘ముఫాసా : ది లయన్‌ కింగ్‌’ పేరుతో ఈ సినిమా రానుంది. మొదటి రెండు పార్ట్‌లలో అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉండడం అతడికి సింబా అనే కుమారుడు జన్మించడం చూడవచ్చు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ముఫాసా అడవికి రాజుగా అసలు ఎలా ఎదిగాడు అన్నది చూపించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ విడుదల చేశారు. ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అకాడమీ అవార్డ్‌ విజేత బేరీ జెంకిన్స్‌ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

➡️