OTT : ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

Mar 21,2024 13:26 #movie, #OTT

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రేక్షకులను అలరించడానికి ప్రతి వారం.. వారం థియేటర్‌లోనూ.. ఓటీటీలోనూ సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఈ వారం ఏ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయో తెలుసుకుందామా..?!

తులసివనం
ప్రముఖ నటుడు, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో అక్షరు, ఐశ్వర్య, వెంకటేశ్‌ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రలో అనీల్‌ రెడ్డి దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘తులసివనం’. ఈ చిత్రం ఈటీవీ విన్‌ ఓటీటీలో మార్చి 21వ తేదీన స్ట్రీమింగ్‌ కానుంది.

ఫైటర్‌
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, నటి దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం ‘ఫైటర్‌’. ఈ చిత్రాన్ని సిద్ధార్ధ్‌ ఆనంద్‌ తెరకెక్కించారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ అండ్‌ మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై మమతా ఆనంద్‌, రామన్‌ చిబ్‌, అంకు పాండే నిర్మించారు. ఎయిర్‌ఫోర్సెస్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్‌ కొట్టింది. థియేటర్‌లో అలరించిన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రెడీ అయింది. మార్చి 21వ తేదీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

భూతద్దం భాస్కర్‌ నారాయణ
నటుడు శివ కందుకూరి, రాశీ సింగ్‌లు నటించిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. ఈ సినిమాకు పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించారు. మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌, విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై స్నేహాల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తిక్‌ ముడుంబై నిర్మించారు. ఈ సినిమా మార్చి 22వ తేదీన ఓటీటీ ఫ్టాల్‌ఫామ్‌ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

ఏ వతన్‌ మేరే వతన్‌
1942లో స్వాతంత్య్ర పోరాటాన్నే కథాంశంగా తెరకెక్కిన ‘ఏ వతన్‌ మేరే వతన్‌’ చిత్రం. ఈ సినిమాలో సారా అలీఖాన్‌, ఆనంద్‌ తివారీ, ఇతర ప్రముఖ తారాగణం నటించారు. ఈ సినిమా మార్చి 21వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రాన్ని కన్నన్‌ ఐయ్యర్‌ అనే దర్శకుడు తెరకెక్కించారు. కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మించారు. ఉషా మెహతా అనే ధైర్యవంతురాలైన పాత్రలో సారా అలీఖాన్‌ నటించారు.

అబ్రహం ఓజ్లర్‌
క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ అబ్రహం ఓజ్లర్‌. ఈ మలయాళ మూవీని ప్రముఖ దర్శకుడు మిథున్‌ మ్యాన్యూల్‌ థామస్‌ తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రముఖ మాలయాళ నటుడు మమ్ముట్టి, జయరామ్‌, అనూప్‌ మేనన్‌లు నటించారు. ఈ ఏడాది జనవరిలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

లాల్‌ సలామ్‌
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘లాల్‌ సలామ్‌’. ఈ సినిమాలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, నిరోషా, ప్రముఖ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ నటించారు. ఈ సినిమాను రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ అల్లిరాజా నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం మార్చి 22 వేదీ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

సుందరం మాస్టర్‌
ప్రముఖ కమెడియన్‌ హర్ష, నటి దివ్య శ్రీపాద నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’. ఈ సినిమాను కళ్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. ఆర్‌టి టీమ్‌ వర్క్స్‌, గోల్డెన్‌ మీడియా పతాకాలపై రవితేజ, సుధీర్‌ కుమార్‌ కుర్ర నిర్మించారు. ఈసినిమా ఈటీవీ విన్‌లో మార్చి 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

➡️