Titanic నటుడు బెర్నార్డ్‌ హిల్‌ మృతి

ముంబయి : చిరస్థాయిగా ఉండిపోయిన చిత్రాల్లో ఒకటైన టైటానిక్‌ సినిమా గురించి చెప్పనక్కరలేదు. ఆ సినిమా నటుడు బెర్నార్డ్‌ హిల్‌ (79) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్‌గా లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్సెట్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమాలోని ఓ పాత్రలో నటించిన హాలీవుడ్‌ నటుడు బెర్నార్డ్‌ హిల్‌ తుది శ్వాస విడిచారు. బెర్నార్డ్‌ ఈ చిత్రంలో కెప్టెన్‌ ఎడ్వర్డ్‌ జాన్‌ స్మిత్‌ పాత్రను పోషించారు. ఈ పాత్రతో అతనికి పాపులారిటీ వచ్చింది. నటుడిగా బెర్నార్డ్‌ కు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. బెర్నార్డ్‌ నటుడుగా అనేక దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో పేరుగాంచారు. ఆయన మఅతి పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

1976లో సినీరంగ ప్రవేశం
బెర్నార్డ్‌ హిల్‌ తన కెరీర్‌లో చాలా సినిమాలు , సిరీస్‌లలో పనిచేశారు. నటుడుగా 1976లో ట్రయల్‌ బై కాంబాట్‌ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించారు. దీని తరువాత గాంధీ, ది బౌంటీ, ది చైన్‌, మౌంటైన్స్‌ ఆఫ్‌ ది మూన్‌, టైటానిక్‌, ది స్కార్పియన్‌ కింగ్‌, లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌ , నార్త్‌ / సౌత్‌ వంటి చిత్రాలలో పనిచేశారు. అతను బార్సు ఫ్రమ్‌ ది బ్లాక్‌ స్టఫ్‌, సన్‌రైజ్‌, వోల్ఫ్‌ హాల్‌ వంటి సిరీస్‌లో నటించి తన నటనతో ప్రసిద్ది చెందారు.

జానపద సంగీత విద్వాంసుడు ట్వీట్‌ …
బెర్నార్డ్‌ మరణ వార్తను స్కాటిష్‌ జానపద సంగీత విద్వాంసుడు బార్బరా డిక్సన్‌ వెల్లడించారు. అతను ఎక్స్‌ వేదికగా బెర్నార్డ్‌ మఅతి గురించి ప్రస్తావిస్తూ ” బెర్నార్డ్‌ హిల్‌ ఈ ప్రపంచంలో ఇక లేరని చెప్పడానికి తనకు చాలా బాధగా ఉంది. మేము జాన్‌ పాల్‌ జార్జ్‌ రింగో, విల్లీ రస్సెల్‌ షోలలో కలిసి పనిచేశాము. బెర్నార్డ్‌ తెలివైన నటుడు. బెర్నార్డ్‌ తో కలిసి పనిచేయడం తనకు ఓ అద్భుతం ” అని రెస్ట్‌ ఇన్‌ పీస్‌ బెన్నీ (బెర్నార్డ్‌ హిల్‌) అని కామెంట్‌ ను జత చేశారు.

➡️