మజ్జిగతో ఆరోగ్యానికి మేలు

Dec 9,2023 09:35 #Jeevana Stories

జ్జిగ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా దోహదపడుతుంది. మజ్జిగ తాగితే చలువ చేస్తుంది. అందుకనే గ్రామాల్లో ఇప్పటికీ మజ్జిగను చల్ల అని పిలుస్తారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎక్కువగా మందులు వాడే సమయంలో సహజంగా వేడి చేస్తుంది. దాని నుంచి తప్పించుకోవటానికి ఎక్కువ మజ్జిగను వాడొచ్చు. నీళ్ల విరోచనాలు, రక్త విరోచనాలు, జిగట విరోచనాలు అవుతున్న సమయంలో మజ్జిగ వాడటం చాలా అవసరం. జిగట విరోచనాలు (అమీబియాసిస్‌) చాలా ప్రమాదకరమైనవి. ఇవి నిదానంగా వ్యాపించి మనిషిని రక్తహీనతకు గురిచేస్తాయి. క్రమేపి నీరసం వస్తుంది. ఇలాంటి అమీబియాసిస్‌ తగ్గాలంటే లీటర్ల కొద్దీ మజ్జిగ తాగాలి. అది కూడా వెన్న లేని పల్చని నీళ్ల మజ్జిగ వాడితే మంచిది. మజ్జిగలో అల్లం, కరివేపాకు వేసుకుంటే మరీ మంచిది. ఒకప్పుడు గ్రామీణులు రాత్రిపూట అన్నంలో పాలుపోసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తోడుపెట్టి ఉదయాన్నే దాన్ని అల్పాహారంగా తీసుకునేవాళ్లు.

➡️