ఎందుకని?

Mar 26,2024 06:20 #feachers, #jeevana, #kavithalu

ఎండలు మండేది ఎందుకని?
మెండుగా మొక్కలు నాటమని
సెగలు కక్కేది ఎందుకని?
పగలు, ప్రతీకారం వద్దని
వడ గాలులు వీచేది ఎందుకని?
అడవుల శాతమే పెంచాలని

భానుని భగ భగ లెందుకని?
కానలు నిరతం కాపాడమని
చెరువులు ఎండేది ఎందుకని?
కరువుకు మేమే సాక్ష్యమని
పండుటాకులు చెప్పేది ఏమని?
నిండుగా ఎపుడూ ఉండాలని …

– గుండాల నరేంద్రబాబు,
తెలుగు సాహిత్య పరిశోధకులు,
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి.

➡️