ఆరోగ్యాన్ని పెంచే రేగుపళ్లు

Feb 6,2024 10:12 #feature

రేగుపండ్లు … ప్రతి ఒక్కరి బాల్యంలో చక్కని జ్ఞాపకాలుగా ముడిపడి ఉంటాయి. చలికాలం నుంచి వేసవికాలం వరకూ ఇది విరివిగా లభిస్తుంటాయి. దేశవాళీ, హైబ్రీడ్‌ రకాల్లో ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. సైజును బట్టి ధరల్లో దొరుకుతున్నాయి. వీటిని తినటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయి. ఈ పండ్లలో ఎక్కువగా ఉండే కాల్షియంతో ఎముకలు బలిష్టంగా మారతాయి. పొటాషియం, జింక్‌, మాంగనీస్‌, పాస్ఫరస్‌, ఐరన్‌, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల ఆరోగ్యానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు అందుతాయి. రక్త హీనత నుంచి మనల్ని కాపాడుతాయి.

ఆర్థరైటిస్‌ నిరోధానికి దోహదం

రక్తంలో చక్కెరను తగ్గించే గుణాన్ని కల్గివుంటాయి. తద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. రోజువారీ ఆహారంలో రేగు పండ్లను చేర్చటం వల్ల మలబద్ధకాన్ని నివారించొచ్చు. ఆస్టియో ఆర్థరైటివ్‌ను నివారించటానికి దోహదపడతాయి.

ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం

కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించటమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచటానికి, జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటానికి దోహదపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగివుండటంతో ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

జీర్ణ వ్యవస్థ మెరుగుదల

ఈ పండ్ల పేస్టును చర్మంపై పూయటం వల్ల గాయం నయం కావటంతోపాటు చర్మం మృదువుగా ఉంటుంది. వీటిలో యాంటీ మైక్రోబయల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉన్నాయి. ఆకలిని, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చటానికి సహాయపడుతుంది. పండ్లను ముక్కలుగా చేసి తేనెలో నానబెట్టుకుని భోజనం తర్వాత తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న వారు వీటిని తినటం వల్ల ఉపశమనం పొందుతారు.

➡️