ఆయన కుమారుడిని కానందువల్లే నాకు అవకాశం రాలేదు : అజిత్‌ పవార్‌

May 9,2024 23:38 #election

పూణె : ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌పై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమారుడిని కానందువ వల్లే తనకు రాజకీయ అవకాశాలు రాలేదన్నారు. శిరూర్‌ లోక్‌సభ పరిధిలో జరిగిన ప్రచార సభలో అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ.. ‘నా వయసు 60 ఏళ్లుపైనే. మనకు అవకాశం రావాలా? వద్దా? మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా? పవార్‌ సాహెబ్‌ మనకు దైవంతో సమానం. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రతి వ్యక్తికీ ఓ సమయం ఉంటుంది. 80 ఏళ్లు దాటిన తర్వాత కొత్తవారికి అవకాశం కల్పించాలి. ఇదెక్కడి న్యాయం?’ అని అజిత్‌ పవార్‌ ప్రశ్నించారు. బిజెపితో కలిసి పనిచేయాలని పవార్‌ తొలుత అనుకున్నారు. నాతోపాటు ప్రఫుల్‌ పేట్‌ల్‌ సమక్షంలో బిజెపి అధిష్టానంతో ఆరు సార్లు భేటీలు జరిగాయి. కానీ పవార్‌ ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చిన తర్వాత నిర్ణయం మార్చుకుని, శివసేనతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. బిజెపితో పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశం లేకపోతే.. ఎందుకు చర్చలు జరిపారు? అని శరద్‌ పవార్‌ని అజిత్‌ పవార్‌ ప్రశ్నించారు.

➡️