యుపిలో ‘ఇండియా’దే మెజార్టీ : అఖిలేష్‌ యాదవ్‌

May 12,2024 23:30 #laknow

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బారాబంకిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బారాబంకి ఎస్‌పికి కంచుకోట వంటిది. ఈ ఎన్నికల్లో యుపిలో దళితులు, మైనార్టీలు, ఓబిసీలు ఎన్డీయేను ఓడించబోతున్నారు. ఆయా తరగతులను బిజెపి మోసగించింది. బిజెపి ప్రభుత్వ హయాంలో వారికి దక్కాల్సిన హక్కులు, గౌరవం దక్కలేదు. అణగారిన వర్గాలు కాషాయ పార్టీకి తగిన బుద్ధి చెప్పబోతున్నాయి. బిజెపి తాను తీసుకున్న గోతిలో తానే పడింది. ఈ ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ యుపిలోని 80 స్థానాల్లో 79 గెలుచుకోనుంది. ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఎంపీలు ప్రధానమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటారు’ అని అన్నారు.

➡️