బిజెపి హిందుత్వానికి.. మా హిందుత్వానికి తేడా ఉంది : ఉద్ధవ్‌ ఠాక్రే

May 11,2024 23:55 #Mumbai

ముంబయి : ‘ఇండియా’ బ్లాక్‌లో భాగస్వామ్య పార్టీ అయిన శివసేన (యుబిటి) అధినేత, మహారాష్ట్ర మాజీ సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే బిజెపిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బిజెపి హిందుత్వానికి, తమ హిందుత్వానికి తేడా ఉందని ఎన్నికల ప్రచార సభలో అన్నారు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఠాక్రే మాట్లాడుతూ.. ‘మా హిందుత్వం ఇంట్లో పొయ్యిలు వెలిగిస్తుంటే.. బిజెపి హిందుత్వం ఇళ్లను తగలబెడుతోంది.’ అన్నారు. ప్రచార సభల్లో ప్రధాని మోడీ పదే పదే ముస్లింల జనాభా పెరుగుదలపై మాట్లాడుతున్నారు. దేశంలో ముస్లిం జనాభా పెరగడం ఆయన విజయమా? లేక వైఫల్యమా అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. ముస్లింల జనాభా పెరుగుదలపై మోడీని అభినందించాలా? లేక విమర్శించాలా అనే దానిపై అయోమయం నెలకొందని ఉద్ధవ్‌ ఠాక్రే మండిపడ్డారు. ఇప్పటికైనా హిందువు- ముస్లింల పేరుతో రాజకీయాలు చేయడం బిజెపి మానుకోవాలని ఠాక్రే సూచించారు. మోడీ డ్రామా కేవలం 4వ తేదీ వరకే కొనసాగుతుందని ఆయన జోస్యం చెప్పారు.

➡️