పులివెందులలో జగన్‌, ఉండవల్లిలో చంద్రబాబు

May 13,2024 00:33 #elections

-ఓటు హక్కు వినియోగించుకోనున్న నేతలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి, టిడిపి, జనసేన అధినేతలు నేడు వారి, వారి ప్రాంతాల్లో సోమవారం ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తను పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం సాయంత్రమే తాడేపల్లి నుంచి పులివెందులకు జగన్‌ చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ షర్మిల పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళగిరిలోని లక్ష్మీనరసింహ స్వామి కాలనీలో ఓటు వేయనున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విజయవాడలోని గవర్నరుపేటలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

➡️