ఖలిస్తానీ వేర్పాటువాది లోక్‌సభ ఎన్నికల్లోపోటీ?

Apr 25,2024 23:16 #Khalistani separatist

అస్సాం జైలులో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్‌ సింగ్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పంజాబ్‌ రాష్ట్రం ఖాదూర్‌ సాహిత్‌ స్థానం నుంచి అమృతపసాల్‌సింగ్‌ పోటీ చేసే అవకాశాలున్నాయని ఆయన తండ్రి తార్సేమ్‌ సింగ్‌ గురువారం చెప్పారు. మొదట్లో రాజకీయాల్లో ఆసక్తి లేకపోయినా.. బుధవారం న్యాయవాది రజ్‌దేవ్‌ సింగ్‌ ఖల్సా దిబ్రూగఢ్‌ జైలులో అమృతపాల్‌ని కలిసిన తర్వాత పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తార్సేమ్‌ సింగ్‌ అన్నారు. కాగా ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ చీఫ్‌ అమృతపాల్‌ సింగ్‌ను గతేడాది ఏప్రిల్‌ 23న పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద కేసు పెట్టారు.

➡️