పోలింగ్‌ సిబ్బందికి పోషకాహారం

May 11,2024 23:43 #election

సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని గ్రామాల్లో పంచాయతి అధికారులను పురపాలికల్లో ప్రత్యేక నియమిత అధికారులను ఆదేశించింది. ఈనెల 12న సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారు. వారికి సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జిగ, 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం అందిస్తారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాఖాహార భోజనం (అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ) అందిస్తారు. పోలింగ్‌ రోజు సోమవారం ఉదయం 6 గంటలకు టీ రెండు అరటిపండ్లు, 8 నుంచి 9 మధ్య ఉప్మా, పల్లీల చట్నీ, 11, 12 గంటలకు మధ్య మజ్జిగ అందిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనంలో కోడిగుడ్డు కూర, ఓ కూరగాయ, చట్నీ, సాంబారు, పెరుగు అందిస్తారు. మధ్యాహ్నం 3, 4 గంటల సమయంలో మజ్జిగ లేదా నిమ్మరసం, సాయంత్రం 5.30 గంటలకు టీ, బిస్కెట్లు అందిస్తారు.

➡️