అమేథీ నుంచి స్మృతి ఇరానీ మళ్లీ పోటి

Apr 28,2024 22:42 #again from Amethi, #Smriti Irani

లక్నో : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉత్తరప్రదేశ్‌ అమేథీ లోక్‌సభ స్థానానికి ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ వేసేముందు ఆమె ఆయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఆ తర్వాత నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. అమేథీలో మే 20వ తేదీన ఐదో దశలో ఓటింగ్‌ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియ శుక్రవారం నాడు (ఏప్రిల్‌ 26) ప్రారంభమైంది. మే 3 నామినేషన్‌లకు చివరి తేది. ఇదిలా ఉండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ ఇప్పటివరకు అమేథీలో పోటీ చేసేందుకు అభ్యర్థిని ప్రకటించలేదు. అమేథీ నియోజకవర్గం కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉండేది. కానీ 2019లో అమేథీ స్థానంలో పోటీ చేసిన రాహుల్‌ గాంధీని స్మృతి ఇరానీ ఓడించారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. మళ్లీ ఇక్కడి నుంచి రాహుల్‌నే బరిలో నిలిపేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ రాయబరేలి స్థానానికి కూడా ఇప్పటివరకూ అభ్యర్థిని ప్రకటించలేదు.

➡️