గుజరాత్‌లో ఘోరం – 33కు చేరిన మృతుల సంఖ్య

May 26,2024 12:37 #33, #death, #Gujarat, #rises

రాజ్‌కోట్‌ (గుజరాత్‌) : గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారిలో టీఆర్‌పీ గేమ్‌జోన్‌ యజమాని యువ్‌రాజ్‌ సింగ్‌ సోలంకితోపాటు దాని మేనేజర్‌ నితిన్‌ జైన్‌ కూడా ఉన్నారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సిట్‌ను నియమించింది. సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ నేతఅత్వంలో సిట్‌ను నియమించగా.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

గుజరాత్‌లో ఘోరం – 27 మంది సజీవదహనం

➡️