రాష్ట్రవ్యాప్తంగా ‘జైల్‌ భరో’ ఉధృతం : అరెస్టులు

Jan 9,2024 12:33 #arrest, #Jail Bharo, #State-Wide

అమరావతి : అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. అంగన్‌వాడీలు, మున్సిపల్‌, సమగ్రశిక్షా ఉద్యోగులకు మద్దతుగా … మంగళవారం అన్ని కార్మిక సంఘాలు జైల్‌భరోకు పిలుపునిచ్చాయి. సమ్మెలు సాగుతున్నా.. స్పందించని ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టనున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాలు జరుగుతాయని నాయకులు ప్రకటించారు. ఆయా జిల్లాల్లో కార్మిక, ప్రజా సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక, రైతు, కౌలు రైతు సంఘాలు నిరసనను ఉధృతంగా నిర్వహించాయి. ఎక్కడికక్కడ పోలీసులు ఆందోళనకారులపై జులుం ప్రదర్శించారు. బలవంతపు అరెస్టులు చేశారు. ఇది రాష్ట్ర కార్మికోద్యమ చరిత్రలో, ప్రజాతంత్ర ఉద్యమ చరిత్రలో నిరంకుశ చర్య అని ట్రేడ్‌ యూనియన్స్‌, రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

శ్రీకాకుళం కలెక్టరేట్‌ : శ్రీకాకుళంలో కార్మిక, ప్రజా సంఘాలు, వ్యవసాయ, రైతు, కౌలు రైతులు చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. నేతలను బలవంతపు అరెస్టులు చేశారు.

ప్రజాశక్తి-విజయవాడ : నేడు విజయవాడలో చేపట్టిన ‘ జైల్‌ భరో ‘ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నేతలను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. అద్దంకిలో మున్సిపల్‌, అంగన్వాడి కార్యకర్తలు అరెస్టయ్యారు.

కాకినాడ : కాకినాడ కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. కలెక్టరేట్‌ గేటును తోసుకుంటూ ముట్టడించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని నాయకులను అరెస్టు చేశారు.

రాజవొమ్మంగిలో సమ్మె ఉధృతం,రాస్తారోకో చేసిన అంగన్వాడీలు, నాయకులను అంగన్వాడీలను అరెస్టు చేసిన పోలీసులు. పోలీస్ స్టేషన్లో బైఠాయించిన కార్మికులు
పాత మున్సిపల్ కార్యాలయం నుండి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్యకర్తలు, నాయకులతో పాటు అంగన్వాడీలు, ఎస్ఎస్ఏ లు పెద్ద సంఖ్యలో ప్రదర్శన
పాత మున్సిపల్ కార్యాలయం నుండి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్యకర్తలు, నాయకులతో పాటు అంగన్వాడీలు, ఎస్ఎస్ఏ లు పెద్ద సంఖ్యలో ప్రదర్శన
అనంతపురంలో జైలు భరో
రాయదుర్గంలో కళ్లకు గంతలు కట్టుకొని అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు

పాడేరులో ‘జైల్‌ భరో’.. నాయకుల అరెస్టులు..

పల్నాడు జిల్లా నరసరావుపేటలో అఖిలపక్ష పార్టీ నాయకుల రాస్తారోకో 

పల్నాడు జిల్లా నరసరావుపేటలో అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ సమస్యలను మరియు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని రాస్తారోకో నిర్వహిస్తున్న అఖిలపక్ష పార్టీ నాయకులు
అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి ముఖ్యంగా జీతాలు పెంచాలి లేకుంటే జైలుకైనా సిద్ధమంటూ నంద్యాల జిల్లాలో జైలు బరో కార్యక్రమంలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు
అంగన్వాడీ లపై ఎస్మా ఎత్తివేయాలని అంగన్వాడీ, ssa,మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని కోరుతూ అల్లూరి జిల్లాలో జైల్ భరో
జగన్మోహనా! నీకో నమస్కారం, మా సమస్యలు పరిష్కరించి పుణ్యం కట్టుకో, - అంగన్‌వాడీలు మోకాళ్లపై నిలబడి ముఖ్యమంత్రికి దండం పెట్టి నిరశన తెలియ జేసారు. చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా
జగన్మోహనా! నీకో నమస్కారం, మా సమస్యలు పరిష్కరించి పుణ్యం కట్టుకో, – అంగన్‌వాడీలు మోకాళ్లపై నిలబడి ముఖ్యమంత్రికి దండం పెట్టి నిరశన తెలియ జేసారు. చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా
అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎల్ఐసి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి జైలు బరో కార్యక్రమానికి బయలుదేరిన అఖిలపక్ష కార్మిక సంఘాలు అరెస్టు చేస్తున్న పోలీసులు సిఐటియు నాయకులు ఎం జగ్గు నాయుడు ఆర్కే శ్రీ కుమార్ పి మనీ కుమారి ఎం సుబ్బారావు ఏఐటియుసి పడాలి రమణ మన్మధరావు 5వ నాయకులు కుమారి పద్మ ప్రభావతి సుమిత్ర తదితరులు పాల్గొన్నారు
విశాఖ : అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎల్ఐసి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి జైలు బరో కార్యక్రమానికి బయలుదేరిన అఖిలపక్ష కార్మిక సంఘాలు అరెస్టు చేస్తున్న పోలీసులు … సిఐటియు నాయకులు ఎం జగ్గు నాయుడు ఆర్కే శ్రీ కుమార్ పి మనీ కుమారి ఎం సుబ్బారావు ఏఐటియుసి పడాలి రమణ మన్మధరావు 5వ నాయకులు కుమారి పద్మ ప్రభావతి సుమిత్ర తదితరులు పాల్గొన్నారు

దద్దరిల్లిన భీమవరం RDO కార్యాలయం... RDO ను అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, కార్మిక, కర్షక, రైతు సంఘాల కార్యకర్తలు....
దద్దరిల్లిన భీమవరం RDO కార్యాలయం… RDO ను అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, కార్మిక, కర్షక, రైతు సంఘాల కార్యకర్తలు….
గత 29 రోజులగా వారి న్యాయమైన సమస్యల కోసం పోరాడుతూ, సమ్మెలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద శిబిరములో ఉన్న అంగనవాడి పోరాటానికి మద్దతు తెలియజేస్తున్న స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు.
గత 29 రోజులగా వారి న్యాయమైన సమస్యల కోసం పోరాడుతూ, సమ్మెలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద శిబిరములో ఉన్న అంగనవాడి పోరాటానికి మద్దతు తెలియజేస్తున్న స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు.
అంగన్వాడి ఉద్యమంపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండిస్తూ ఒంగోలు లో ప్రజాసంఘాల నాయకులు చేపట్టిన రాస్తారోకోను అడ్డుకొని అరెస్టు చేశారు.
అంగన్వాడి ఉద్యమంపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండిస్తూ ఒంగోలు లో ప్రజాసంఘాల నాయకులు చేపట్టిన రాస్తారోకోను అడ్డుకొని అరెస్టు చేశారు.
తిరుపతిలో అంగన్వాడీలు జైల్ భరో కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ అరెస్టు చేయడంతో ధర్నా చేస్తున్న దృశ్యం
తిరుపతిలో అంగన్వాడీలు జైల్ భరో కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ అరెస్టు చేయడంతో ధర్నా చేస్తున్న దృశ్యం
➡️