అరుణ చంద్రుడు

Dec 4,2023 08:54 #sahityam

చైతన్య జీవనదులన్నీ

కలిసిన సంగమంలా

చెమట నెత్తురు కన్నీటితో

ఎగసిపడే ఎర్రసముద్రాన్ని

నేను చూసాను

నినదించే

జనజాగత పతాకాలను చూసాను

 

ఆ ఎర్రమందారం తోటనా

గుండెల్లో పూచింది

ఈ కార్తీక పౌర్ణమి రోజు

అరుణవర్ణ చంద్రుడు ఉదయించాడు

 

కార్మికులు కర్షకులంటే

ఈ నేలతల్లి చేతిలో కంకీ కొడవలి

ఆ కొడవలి వరికోతలే కాదు

అవినీతి అణచివేత రాజ్యహింస

అహంకారాలను కోయగలదు

 

గాజాలో కనిపించిన విధ్వంసమైతే

భరతభూమిలో అధికారం

అగుపించని మందుపాతర

స్వేచ్ఛను మానవహక్కులను పాతరేస్తూ…

 

కార్మికులు కర్షకులు

దేశానికి రెండు కళ్ళైతే

కనుగుడ్లు బయటకొచ్చి

నెత్తురోడుతున్న భరతమాత …

అన్యాయాలపై అక్రమాలపై

అవినీతి రాజ్యంపై తిరగబడే

ఆ శ్రమ పాదముద్రలకు

కదిలే అగ్నిపూల చెట్లకు

ఎగిరే ఆ నెత్తుటి జెండాలకు

నా లాల్‌ సలామ్‌

 

ఇప్పుడు దేహాలు హదయాలే కాదు

దేశమే యుద్ధభూమిలో…

మన చేతిలో ఓట్లే బోయీలై

ప్రజాస్వామ్యాన్ని పల్లకిలో ఊరేగిద్దాం! – సరికొండ నరసింహరాజు 9398254545

➡️