ఆ ఒక్క రోజు జాగ్రత్త!

Apr 22,2024 03:13 #edit page, #sahityam

గట్టికో పట్టుకో
ఆ ఒక్క రోజును జాగ్రత్త
డబ్బుకి అతుక్కోని పలుచన కాకు
కులంలో జారిపోయి అజ్ఞానిగా మిగలకు
అదను మరచి పదును పోగొట్టుకోని
పిచ్చోడిగా మారిపోవద్దు!

దూరంగా చూడటం నేర్చుకో
విలువగా మెలగడం తెలుసుకో
ముసుగులను, మూసలను పసిగట్టి
మాటల్లో విషానికి విరుగుడుగా మారి
తెలివిగా మసలుకోని
ప్రజాస్వామ్యంలో నీ పాత్ర స్వచ్ఛతను కాపాడుకో
ఓటు పరువు పోకుండా
ఈ ఒక్క రోజూ స్ప ృహలో ఉండు…

– శ్రీ సాహితి
97044 37247

➡️