కొత్త జతగాడు…!

Jan 5,2024 08:43 #sahityam

గత కాలం వెళ్ళి పోయింది

పాత కాలపు మిత్రుడిలా …!

నూతన సంవత్సరమొచ్చింది

కొత్త స్నేహితుడి చిరునవ్వులా..!!

పాత ఏడాది అంతా రిత్త కాదు

కొత్తది మాత్రం సరికొత్త అవ్వదు

కొత్త పాత మేలు కలయికతోనే

కాల రేఖ కొత్త పుంతలు తొక్కుతుంది

జీవిత నౌకను సవ్యంగా నడిపిస్తుంది..!

గడిచిన ఏడాది అనుభవాల పేటిక

పొడిచిన సంవత్సరం అనుభూతుల వేదిక

గత కాలం చేదు జ్ఞాపకాలయితే

వర్తమానం స్వాదు ఫలాల సాదృశ్యం ..!

గతం ఆత్మీయుడిలా నిన్ను పెనవేసుకుని

వుంటే

అతిథిలా సాదరంగా స్వాగతం పలుకుతున్నాడు

కొత్త సంవత్సరం జతగాడు నీకు..!!

– జి.సూర్యనారాయణ, సెల్‌ : 6281725659.

➡️