రోజూ ఉడకబెట్టిన గుడ్లు తింటే బరువు తగ్గుతారా?

Dec 15,2023 18:10 #health

 

నేటికాలంలో ఎక్కువమంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం చాలా తక్కువ మోతాదులో తీసుకుంటారు. దీంతో అధిక బరువు తగ్గడం అటుంచి పలు అనారోగ్యాలకు గురవుతున్నారు. అలా కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, రోజూ ఉడకబెట్టిన గుడ్లు తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

– ఆకుకూరలతోపాటు, గ్రుడ్లు రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

– ఉదయం టిఫిన్‌కు బదులు.. ఉడకబెట్టిన రెండు కోడిగుడ్లు, పాలు తీసుకుంటే మంచిది

.– ఉదయంపూట లిమిట్‌గా కాఫీ, టీ పానీయాలు తీసుకుని, నానబెట్టిన తృణధాన్యాలతోపాటు, గుడ్డు తీసుకున్నా.. త్వరగా బరువు తగ్గుతారు.

– గుడ్డు తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో తీసుకునే ఆహారాన్ని మితంగా తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గే అవకాశముంది అని వైద్యులు చెబుతున్నారు. 

➡️