ఓటరన్నా…

May 12,2024 11:09 #kavithalu, #Sneha

ఓ ఓటరన్నా…
ఓటరన్నా… ఓ ఓటరన్నా…
నోటుకు నీ ఓటు నీచమన్నా
కడు నీచమన్నా… పాడు బతుకన్నా
భవితే నాశనమన్నా వినాశనమన్నా
పచ్చగా మనదేశం ఎదగాలన్నా
మచ్చలేని మనిషిగా బతకాలన్నా
విచక్షణతోనే వోటు వేయాలన్నా
విచారించి మంచికి చోటివ్వాలన్నా
ప్రజాస్వామ్యం మనగలగాలన్నా
ప్రజలందరు క్షేమంగా ఉండాలన్నా
ప్రగతి బాట దేశమే పట్టాలన్నా
జగతి శాంతి గీతమే పాడాలన్నా
సమతా మమతలు వెల్లి విరియాలన్నా
సమభావనతో జగమే మెలగాలన్నా
లౌకిక రాజ్యం కొనసాగాలన్నా
నకిలీ మనుషులు మట్టి కరవాలన్నా
ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలన్నా
నీతికి నిత్య హారతులే పట్టాలన్నా
అవినీతి పరుల భరతం పట్టాలన్నా
భావి పౌరుల బాసట కావాలన్నా
నీ ఓటే నీ ఆయుధం అని గమనించాలన్నా!!

గుండాల నరేంద్రబాబు
9493235992

➡️