చదువు, ఆట, పాటల నిలయం

Apr 7,2024 09:20 #Sneha, #Stories

పాఠశాల ఎలాంటి చోటు అంటే అక్కడ చదువుతోపాటు, చాలా ఆటలు, పాటలు ఉంటాయి. అలాగే చాలామంది స్నేహితులు కూడా ఉంటారు. పాఠశాల ప్రతి విద్యార్థికి రెండవ ఇల్లు వంటిది. ఎందుకంటే విద్యార్థులు ఎక్కువగా గడిపేది పాఠశాలలోనే. కనీసం 8 గంటలు గడుపుతారు పాఠశాలలో. ప్రతి తరగతిలోనూ ఆరు సబ్జెక్టులు ఉంటాయి. అవే గణితశాస్త్రం, ఆంగ్లం, తెలుగు, హిందీ, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం. ఇవి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని సబ్జెక్ట్స్‌ మాత్రమే. చాలామంది పిల్లలకు గణిత శాస్త్రం అంటే బాగా ఇష్టం. కానీ సైన్స్‌ అంటే ఇష్టం ఉండదు. పాఠశాల పిల్లలకు సైన్సు చాలా ముఖ్యం. చిన్న పిల్లలు పని చేయకూడదు, వారు బడికి వెళ్లి చదువుకోవాలి. వారి చదువులు పూర్తయిన తర్వాత, ఏదో ఒక మంచి ఉద్యోగం చేయాలి, ఆనందంగా బ్రతకాలి. కావున పాఠశాల ప్రతి పిల్లలకు ముఖ్యమైనది. పాఠశాలను విద్యాలయం అని కూడా అంటారు. అంటే విద్యకు ఆలయం అని అర్థం. పాఠశాలలో మనకు ప్రేమ, అనురాగాలు ఉంటాయి.

– ఎం. అఫ్రెడ్‌ ఆనంద్‌ బాబు, 8వ తరగతి,
అరవింద హై స్కూలు, కుంచనపల్లి, గుంటూరుజిల్లా.

➡️