ఇది ఉంటే ఇల్లంతా చల్లగా..

Mar 17,2024 07:46 #Sneha, #Technology

ఈసారి ఎండాకాలం అప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మున్ముందు మరింత వేడిగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. అందువల్ల మనం ఇళ్లలో చల్లదనం కోసం కొన్ని రకాల ఎలక్ట్రిక్‌ వస్తువులు కొనుక్కుంటాం. అలాంటి వాటిలో ఒకటైన ఈ భారీ హ్యుమిడిఫైయర్‌.. ఇంటిని చల్లగా ఉంచుతుంది. దీని ధర, ఫీచర్స్‌ తెలుసుకుందాం.
ఇది ఆర్‌ బయోకో బ్రాండ్‌ నుంచి వచ్చిన హ్యుమిడిఫైయర్‌. ఇది 6.5 లీటర్ల కెపాసిటీతో ఉంది. పెద్ద గదుల కోసం దీన్ని రూపొందించారు. ఇది బెడ్‌రూంలో అట్రాసోనిక్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫలితంగా దీనివల్ల ఇంట్లో తేమ పెరిగి.. ఉక్కపోత పోతుంది. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇది వారికి చాలా బాగుంటుంది. దీని నుంచి పొగ మంచు బయటకు వస్తూ ఉంటుంది. ఆ పొగ మంచు ఇల్లంతా విస్తరిస్తూ, చల్లదనాన్ని ఇస్తుంది. ఇది శబ్దం చెయ్యదు.. కాబట్టి.. పిల్లలు హాయిగా నిద్రపోతారు. ఇందులో నీరు నిండుగా పోశాక.. ఇది కంటిన్యూగా 45 గంటలపాటు చల్లదనం ఇస్తుంది. ఇది 430 చదరపు అడుగుల గదికి కూడా సెట్‌ అవుతుంది. మాటిమాటికీ నీరు నింపుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి 360 డిగ్రీల స్టీమ్‌ నాజిల్‌ ఉంటుంది. అందువల్ల చల్లటి నీరు పోసుకుంటే, అన్ని వైపులకూ చల్లదనం వస్తుంది. కావాలనుకుంటే.. సెంట్‌ స్ప్రే (Aతీశీఎa ణఱటటబరవతీ) కూడా చేసుకోవచ్చు. దీంతో ఇల్లంతా పరిమళంతో నిండిపోతుంది. దీనికి నైట్‌ లైట్‌ కూడా ఉంది. అందువల్ల రాత్రివేళ ఇది బెడ్‌లైట్‌ లాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఇది ఉంటే.. రాత్రిళ్లు హాయిగా నిద్రపోవచ్చు. ఇందులో 6.5 లీటర్ల నీరు పోసుకోవచ్చు. నీరు అయిపోతే, లో వాటర్‌ ఇండికేటర్‌ ఉంది. అది అలర్ట్‌ చేస్తుంది. దాంతో మళ్లీ పోసుకోవచ్చు. నీరు పూర్తిగా అయిపోగానే, దానంతట అదే స్విచ్‌ ఆఫ్‌ అవుతుంది. దీని వాటర్‌ ట్యాంక్‌ను రిమూవ్‌ చెయ్యవచ్చు. అందువల్ల ట్యాంక్‌ని విడదీసి, క్లీన్‌ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్‌ డైమెన్షన్స్‌ చూస్తే.. 22.8 సెంటీమీటర్ల పొడవు, 15.7 సెంటీమీటర్ల వెడల్పు, 31.3 సెంటీమీటర్ల ఎత్తు ఉంది. దీని అసలు ధర రూ.4,500 ఉండగా.. అమెజాన్‌లో దీనిపై 31 శాతం డిస్కౌంట్‌ ఇస్తూ, రూ.3099కి అమ్ముతున్నారు. ఈ ప్రొడక్ట్‌కి సంవత్సరం వారంటీ ఉంది. అలాగే కస్టమర్‌ సపోర్ట్‌ టీమ్‌ కూడా ఉంది. అమెజాన్‌లో లభిస్తున్న ఈ ప్రొడక్ట్‌ సరిగా పనిచెయ్యకపోతే, తిరిగి వెనక్కి ఇచ్చేసేలా పాలసీ కూడా ఉంది. ఈ ఉత్పత్తి బరువు 1.81 కేజీలు ఉంది. దీన్ని బెడ్‌రూమ్‌, లివింగ్‌ రూమ్‌, డైనింగ్‌ రూమ్‌, కిచెన్‌, కిడ్స్‌ రూమ్‌, నర్సరీ, బాత్రూమ్‌, హోమ్‌, ఆఫీస్‌ ఇలా ఎక్కడైనా వాడుకోవచ్చని చెప్తున్నారు.

➡️