చట్టం.. న్యాయం.. ధర్మం

May 12,2024 11:25 #chirumuvallu, #Sneha

నోటు లేకుండనే
నోటి మాటలతోనె
అయిదు లక్షలు నీకు
అప్పిచ్చె నో వ్యక్తి!

ఆ డబ్బుతో నీవు
అభివృద్ధి చెందావు!
ఆ వ్యక్తి నష్టపడి
ఆస్తి పోగొట్టుకొనె!!

ఆ దిగులు అధికమై
ఆ వ్యక్తి చనిపోయె!
విధి లేక కుటుంబం
వీధిపాలైపోయే!!

నోటు లేదూ గనుక
నోటి మాటే గనుక
అప్పు తీర్చుట ఇంక
అనసరమను చట్టం!!

నోటు లేదూ గనుక
నోటిమాటే గనుక
అప్పు తీర్చవలసిన
అవసరం లేదనక

అప్పు తెచ్చిన డబ్బు
తప్పకుండా నీవు
అసలు, వడ్డీలతో
అందించుటె న్యాయం!!

అప్పు తీర్చుటెగాక
ఆ కుటుంబానికీ
అండగా నీవుండి
ఆదుకొనుటె ధర్మం!

‘బాల బంధు’ అలపర్తి వెంకట సుబ్బారావు
94408 05001

➡️