మారేది కాలమే!

Jan 7,2024 07:04 #Sneha
new year poetry

కాలాలు మారుతూ ఉంటాయి

మనుషులూ మారుతుంటారు.

పయనం మాత్రం ఆగదు!

కాలం సైతం తరగదు!

పరిమళం వికసించిన చోటవాడిపోయే వికారమూ ఉంటుంది!

గెలుపు ఉన్నచోట

ఓటమి కూడా సిద్ధంగా ఉంటుంది!

అన్నిటినీ ఎదుర్కొనేవాడే

ముందుకు సాగిపోతాడు..

కాదని అక్కడే ఆగిపోతే

మిగిలేది చివరికి శూన్యమే!

కొత్త అడుగు వేసే ప్రతిసారి

కొండంత అడ్డంకులు ..

అన్నింటినీ జీర్ణించుకుంటేనే

జీవించగలుగుతాం!

కొత్తదనం ఎప్పుడూ

పాతదనాన్ని తిరస్కరించదు!

అన్నిటినీ కలుపుకొని

నూతన ఉత్సాహంతో సాగమంటుంది!

ఏడాది గడిచేకొద్దీ

ఏం సాధించామనే ప్రశ్న ఉదయిస్తుంది!

సమాధానం వెలుగొందినప్పుడే

కక్ష కట్టిన కాలం మౌనంగా ఉంటుంది!

ఎదురీదితే

ఏదైనా తల వంచాల్సిందే!

వెంటపడితే

ఏదైనా గుప్పిట్లో చేరిపోవాల్సిందే!

 

  • పుట్టి గిరిధర్‌ – 9494962080
➡️