కడలిలో అలల వలే..!

Jan 7,2024 07:13 #Poetry, #Sneha
poetry on women

 

ఆటంకాల అంచుల్లో..

ఎంతకాలం వనిత పోరాటం ?

విజృభించే వరదలా

కాటేసే నాగులా మారాలి

మదమెక్కి కొట్టుకునే మగాడి

అంతానికి చరమ గీతం పాడాలి..

కడలిలో అలల వలే

కన్నెర్ర చేసి రుధిరం వలె మరుగుతూ

మభ్య పెడుతున్న మగాడి మాటలకు

గర్వానికి అంతం పలకాలి..

ఆడపిల్ల కొవ్వొత్తి కాదు

కరిగిపోడానికి

కూరలో వేసే పోపు కాదు

సువాసనలు వెదజల్లడానికి

అత్తరు కాదు

నలుగురిని కవ్వించడానికి

స్వేచ్ఛ.. హక్కుల కోసం ప్రతిక్షణం

పరుగులు పెడుతూనే ఉంటాం

కదిలే కాలానికి చేయూతనిచ్చేది మేమే

కాలచక్రంలో వెలుతురు పంచేది మేమే

పంటిని బిగించి నొప్పిని భరించేది మేమే

పదాల ఒంపు సొంపుల్లో పదనిసలు పలికించేది మేమే

ఆటంకాల అంచుల్లో పరిగెత్తేది మేమే

ఓటమి ఎదురయినా, బాధను భరించి

కష్టాన్ని దిగమింగి నవ్వుతూ నడుస్తున్నాం

అలా అని తక్కువ అంచనా వేయకండి

మీ తలతీసే పొగరు ఒంటి నిండుగా

నింపుకుని బతుకుతున్నాం..

 

  • పోలగాని భానుతేజ – 9866597260
➡️