ఊరటనిచ్చే ఊటీ..

May 12,2024 11:33

తమిళనాడులోని నీలగిరి పర్వతాలపైన ఉన్న పట్టణమే ఊటీ. సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఊటీ ఉంటుంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి, కనువిందు చేసే పచ్చదనానికి, ముచ్చటగొలిపే లోయలకు ఎవ్వరైనా ముగ్ధులవ్వాల్సిందే. ఊటీ అందాలకు ఆకర్షితులైన ఆంగ్లేయులు వీటిని ‘క్వీన్‌ ఆఫ్‌ హిల్స్‌’ అని పిలిచేవారు. అయితే దీని అధికారిక నామం మాత్రం ఉదక మండలం. ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా ఉండటంతో వేసవి విడిదిగా ప్రసిద్ధి గాంచింది. నీలగిరి జిల్లా పరిపాలనా విధుల నిర్వహణంతా ఊటీలోనే జరుగుతుంది. వేసవిలో వచ్చే పర్యాటకులు ఇక్కడ విశ్రాంతిగా గడిపేందుకు సౌకర్యాలు ఉన్నాయి.

➡️