బావిలోకి, గట్టుపైకి

Apr 28,2024 08:28 #Sneha

హాయ్ చిన్నారులూ! సెలవులు ఇచ్చేశారు కదా! మరి ఆడుకుందాం. ఆట పాట మనకే సొంతం. అందుకే ఒక ఆట మీకు ఇక్కడ చెప్పేస్తున్నా. ఈ ఆటలో ఒక లైన్‌ గీయాలి. దానిపై పిల్లలు (ఎంతమంది అయినా) వరుసగా నిలబడాలి. ఒకరికి మరొకరికి మధ్య ఒక అడుగు దూరం ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎదురుగా అడుగు దూరంలో ఒక వృత్తం (వృత్తంలో రెండు కాళ్ళు సరిపోయేంత) గీయాలి. ఒకరు టీచర్‌గా ఉండి, మిగిలిన వారు లైన్‌పై నిలబడాలి.
ఆడటం ఇలా :
టీచర్‌ ఆట ప్రారంభించడానికి రెడీ చెప్పి, బావిలోకి అనగానే వృత్తంలోకి రెండుకాళ్ళతో ఎగిరి దూకాలి. తర్వాత గట్టుమీదకి అనగానే వెనక్కి ఎగిరి మొదట నిలబడ్డ గీతమీదకి దూకాలి. టీచర్‌ ఆ విధంగా చెబుతూనే వేగం పెంచాలి. మధ్యలో పిల్లలను తికమక పెట్టడానికి చెప్పిందే మరల (గట్టు.. మళ్ళీ గట్టు మీదికి అలా) చెప్పాలి. అలా చెప్పినప్పుడు బావిలోకి అన్నప్పుడు గట్టుమీదికి దూకినా, గట్టు మీదికి అన్నప్పుడు వృత్తం (బావి)లోకి దూకినా వారు అవుట్‌ అయినట్లు. ఇలా చేసేటప్పుడు వంగబడినట్లు శరీరం పూర్తిగా వాలిపోయినా, ఒకరికి మరొకరు తగిలి నేలను తాకినా అవుట్‌ అయినట్లే. అవుట్‌ అయిన వారు పక్కకి వచ్చేయాలి. చివరికి ఎవరు మిగులుతారో వారు గెలిచినట్టు.
ఈ ఆట ఫిజికల్‌ ఎక్సర్‌ సైజ్‌గా ఉపకరిస్తుంది. పిల్లల మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది.

➡️