మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర ఢీ -రంజీట్రోఫీ క్వార్టర్స్‌

Feb 22,2024 22:20 #Sports

ఇండోర్‌: రంజీట్రోఫీ నాకౌట్‌ పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే క్వార్టర్‌ఫైనల్‌ పోటీల్లో ఎలైట్‌ గ్రూప్‌-బిలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు గ్రూప్‌-డిలో టాప్‌లో ఉన్న మధ్యప్రదేశ్‌తో తలపడనుంది. దాదాపు రెండు నెలలపాటు సాగిన లీగ్‌ పోటీలు ముగిసిన అనంతరం ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. విదర్భాకర్ణాటక, తమిళనాడుాసౌరాష్ట్ర, ముంబయి-బరోడా జట్ల మధ్య ఇతర క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

➡️