సుమిత్‌ నగాల్‌ బోణి-ఇండియన్‌ వెల్స్‌ క్వాలిఫయర్స్‌

Mar 5,2024 22:23 #Sports

న్యూయార్క్‌ : భారత టెన్నిస్‌ స్టార్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ మరో విజయం సాధించాడు. అమెరికాలో జరుగుతున్న ఇండియన్‌ వెల్స్‌లో బోణీ కొట్టాడు. తొలిసారి ఈ టోర్నీలో తలపడుతున్న నగాల్‌.. అమెరికాకు చెందిన స్టెఫాన్‌ డొస్టానిక్‌ను వరుససెట్లలో ఓడించాడు. 97వ ర్యాంకర్‌ అయిన నాగల్‌ ‘వైల్డ్‌ కార్డ్‌’ ఎంట్రీతో ఈ టోర్నమెంట్‌లో ప్రవేశించి.. స్టెఫాన్‌ను రెండు సెట్లలోనే చిత్తుచేశాడు. 68 నిమిషాల పాటు సాగిన పోరులో 6-2, 6-2తో ఓడించి ఫైనల్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌కు అర్హత సాధించాడు. దక్షిణకొరియాకు చెందిన సియాంగ్‌ చాన్‌ హాంగ్‌ను నగాల్‌ ఢకొీట్టనున్నాడు. ఫైనల్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌కు చేరినందకు నగాల్‌కు 10పాయింట్లు లభిస్తాయి. అంతేకాదు 14,400 డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో రూ.11 లక్షల ప్రైజ్‌మనీ దక్కనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచన విజయాలు సాధించిన నాగల్‌.. ‘రేస్‌ టు ఇండియన్‌ వెల్స్‌’ టోర్నీలోనూ అదరగొట్టాడు. దాంతో, ఈ యంగ్‌స్టర్‌ నేరుగా ఇండియన్‌ వెల్స్‌ టోర్నీకి క్వాలిఫై అయ్యాడు. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో కజకిస్థాన్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ బబ్లిక్‌పై నగాల్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే.

➡️