4వ స్థానంలో జ్యోతి సురేఖ

May 21,2024 22:30 #Sports

ఆర్చరీ ప్రపంచకప్‌
యూహన్‌(కొరియా): ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌ా2లో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత వెన్నెం జ్యోతి సురేఖ నాల్గో స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో జ్యోతి సురేఖ 707పాయింట్లతో ఈ స్థానంలో నిలిచింది. ఇక హన్‌ సూజియన్‌(చైనా) 711పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తొలి రౌండ్‌లో భారత మహిళల బృందానికి బై లభించగా.. ఆ తర్వాత 7వ సీడ్‌ ఇటలీతో భారత మహిళల బృందం తలపడనుంది. ఇక పర్ణీత్‌ కౌర్‌(704), అదితి స్వామి(702) ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. రికర్వు పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారత పురుషుల రికర్వు జట్టు తొలిరౌండ్‌లో కొరియాతో తలపడనుంది. ఈ పోటీల్లో భారత్‌ 5స్వర్ణ, 2రజిత, ఒక కంస్యంతో అగ్రస్థానంలో ఉండగా.. కొరియా 2స్వర్ణ, 3రజిత, 2కాంస్యాలతో రెండోస్థానంలో ఉంది.

➡️