మెరిసిన రుతిక

Apr 12,2024 23:00 #Sports

కొరియాపైన 2-1తో విజయం
బిల్లీ జీన్‌ కప్‌-2024
ఛాంగ్‌షా(చైనా): ఆసియా పసిఫిక్‌ ఓషియానా టెన్నిస్‌లో భాగంగా బిల్లీ జీన్‌ కింగ్‌కప్‌-2024లో భారత క్రీడాకారిణుల హవా కొనసాగుతోంది. తొలి లీగ్‌లో తైవాన్‌లపై నెగ్గిన భారత మహిళలబృందం.. తాజాగా కొరియాపైనా ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మూడో లీగ్‌ పోటీలో భారత్‌ 2-1తేడాతో కొరియాను చిత్తుచేసింది. రుతుజ భోసాలే, అంకితా రైనా, ప్రార్థనా థోంబరేలతో కూడిన భారత బృందం ప్రపంచ గ్రూప్‌ ప్లాేఆఫ్‌లో చోటుకోసం ఈ టోర్నీ బరిలోకి దిగింది. తొలి సింగిల్స్‌లో రుతుజ 6-2, 6-2తో సోహ్యూన్‌ను చిత్తుచేయగా.. రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 2-6, 3ా6తో సుజోంగ్‌ జాంగ్‌ చేతిలో ఓటమిపాలైంది. ఇక నిర్ణయాత్మక డబుల్స్‌లో అంకితాప్రార్థన 6-4, 6-4తో కిమ్‌-సోయున్‌లను చిత్తుచేయడంతో భారత్‌కు విజయం వరించింది. శనివారం జరిగే చివరి లీగ్‌లో భారత్‌ న్యూజిలాండ్‌తో తలపడనుంది. మరోవైపు న్యూజిలాండ్‌ రెండు విజయాలతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.

➡️