పాకిస్థాన్‌ హెడ్‌ కోచ్‌గా అజహర్‌ మహమూద్‌

Apr 9,2024 15:40 #Sports

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌ హెడ్‌ కోచ్‌గా ఆ దేశ మాజీ ఆటగాడు అజహర్‌ మహమూద్‌ ఎంపికయ్యాడు. ఈ నెలలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఆయన కోచ్‌గా పనిచేయనున్నాడు. అలాగే టీమ్‌ సీనియర్‌ మేనేజర్‌గా మన్సూర్‌ రాణాను నియమించారు. ఈ మేరకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చీఫ్‌ సెలక్టర్‌ వాహాబ్‌ రియాజ్‌ ఈ రెండు నియామకాలపై ప్రకటన విడుదల చేశారు.
ఇక న్యూజిలాండ్‌తో ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌కు పాకిస్థాన్‌ మంగళవారం జట్టును ఎంపిక చేయనుంది. కాగా, అజహర్‌ పాక్‌ తరఫున 164 మ్యాచుల్లో 162 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్‌లో 2421 పరుగులు చేశాడు. గతంలో పాక్‌ బౌలింగ్‌ కోచ్‌గా కూడా విధులు నిర్వర్తించాడు.

➡️