INDvENG: కెప్టెన్‌ రోహిత్‌ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ట్వీట్‌..

Mar 9,2024 13:12 #Cricket, #Sports, #Team India

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు ఇంగ్లాడ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత సారథి రోహిత్‌ మాత్రం మైదానంలోకి దిగలేదు. తాజాగా రోహిత్‌ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ స్పందించింది. ”కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడో రోజు మైదానంలోకి దిగలేదు. వెన్ను నొప్పి కారణంగా అతడు డగౌట్‌కే పరిమితమయ్యాడు” అని బీసీసీఐ అప్‌డేట్‌ ఇచ్చింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఫిట్‌నెస్‌ కారణంగా మిస్‌ కావడం ఇదే తొలిసారి. రోహిత్‌ గైర్హాజరీలో జట్టును వైస్‌ కెప్టెన్‌ బుమ్రా నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 114 పరుగులు వెనకబడి ఉంది. భారత్‌ గెలవాలంటే 2 వికెట్లు తీయాల్సి ఉంది.

➡️