భువనేశ్వర్‌ కుమార్‌ మ్యాజిక్‌

May 8,2024 22:56 #Sports

-లక్నో కట్టడి
-హైదరాబాద్‌ లక్ష్యం 166పరుగులు
హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న ఐపిఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు రాణించారు. భువనేశ్వర్‌ కుమార్‌(2/12)కి తోడు వ్యాషక్‌, షాబాజ్‌ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌జెయింట్స్‌ను సన్‌రైజర్స్‌ ఆరంభం నుంచి కట్టడి చేసింది. లక్నో జట్టు మూడో ఓవర్‌లోనే క్వింటన్‌ డికాక్‌ (2) వికెట్‌ను కోల్పోయింది. ఐదో ఓవర్‌లో రెండో బంతికి స్టాయినిస్‌ (3).. సన్వీర్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో వికెట్లను కాపాడుకునే క్రమంలో లఖ్‌నవూ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌(29), కృనాల్‌ పాండ్యా(24) వికెట్లు కాపాడుకునే పనిలో పడి పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డారు. దీంతో లక్నో జట్టు పవర్‌ప్లే 6ఓవర్లు ముగిసేసరికి 27 పరుగులే చేసింది. పదో ఓవర్‌లో కెఎల్‌ రాహుల్‌ రూపంలో లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ వేసిన ఈ ఓవర్‌లో చివరి బంతికి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన కేఎల్‌ రాహుల్‌.. నటరాజన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కృనాల్‌ పాండ్యా కూడా ఔటయ్యాడు. 12వ ఓవర్‌లో కృనాల్‌ పాండ్యా రనౌటై పెవిలియన్‌కు చేరాడు. టాపార్డర్‌ విఫలమైన వేళ క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌(48), బదోని (55) లక్నోను ఆదుకున్నారు. వీరిద్దరూ చివర్లో ఆదుకోవడంతో లక్నో జట్టు గౌరవప్రద స్కోర్‌ చేయగల్గింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లు భువనేశ్వర్‌కు రెండు, కమిన్స్‌కు ఒక వికెట్‌ లభించింది. కమిన్స్‌, నటరాజన్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
స్కోర్‌బోర్డు…
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: కెఎల్‌ రాహుల్‌ (సి)నటరాజన్‌ (బి)కమిన్స్‌ 29, డికాక్‌ (సి)నితీశ్‌ రెడ్డి (బి)భువనేశ్వర్‌ 2, స్టొయినీస్‌ (సి)సన్విర్‌ సింగ్‌ (బి)భువనేశ్వర్‌ 3, కృనాల్‌ పాండ్య (రనౌట్‌)కమిన్స్‌ 24, పూరన్‌(నాటౌట్‌) 49, ఆయుష్‌ బడోని(నాటౌట్‌) 55, అదనం 4. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 165పరుగులు. వికెట్ల పతనం: 1/13, 2/21, 3/57, 4/66 బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-12-2, కమిన్స్‌ 4-0-47-1, షాబాజ్‌ 2-0-9-0, విజరుకాంత్‌ వ్యాషక్‌ 4-0-27-0, ఉనాద్కట్‌ 2-0-19-0, నటరాజన్‌ 4-0-50-0

➡️