శ్రీలంక క్లీన్‌స్వీప్‌

Feb 15,2024 09:29 #Cricket, #srilanka
Cleansweep Sri Lanka afghanistan

మూడో వన్డేలోనూ ఆఫ్ఘన్‌పై గెలుపు

పల్లెకెలె: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలోనూ శ్రీలంక జట్టు గెలిచి క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి రెండు వన్డేలను గెలిచి ఇప్పటికే సిరీస్‌ను చేజిక్కించుకున్న శ్రీలంక.. బుధవారం జరిగిన చివరి వన్డేలో 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 48.2ఓవర్లలో 266పరుగులకు ఆలౌటైంది. రామత్‌ షా(65), అజ్మతుల్లా(54) అర్ధసెంచరీలతో రాణించగా.. ఓపెనర్‌ గుర్బాజ్‌(48) తృటిలో అర్ధసెంచరీని మిస్‌ చేసుకున్నాడు. శ్రీలంక బౌలర్లు మధుశంకకు మూడు, ఫెర్నాండో, వెల్లలగే, ధనుంజకకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 35.2ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 267పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ నిస్సంక(118) సెంచరీకి తోడు మరో ఓపెనర్‌ ఫెర్నాండో(91) సెంచరీని మిస్‌ చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 173పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్‌ బౌలర్లు అహ్మద్‌కు రెండు, నబికి ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌ నిస్సంకకు లభించాయి. ఇరుజట్ల మధ్య మూడు టి20ల సిరీస్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది.

➡️