నాగల్‌కు నిరాశ

May 21,2024 22:15 #Sports

జెనీవా ఓపెన్‌ తొలిరౌండ్‌లోనే ఓటమి
జెనీవా: భారత టాప్‌ర్యాంక్‌ టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నాగల్‌ జెనీవా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ తొలిరౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో సుమిత్‌ 6-7(5-7), 3-6తో 19వ ర్యాంకర్‌ అర్జెంటీనాకు చెందిన సెబాస్టియ్ బీజ్‌ చేతిలో ఓడాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సుమిత్‌ 94వ స్థానంలో ఉండగా.. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగానికి చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌ సుమారు గంటా 52నిమిషాలసేపు సాగింది. తొలిసెట్‌లో సుమిత్‌ ఓ దశలో 4-1పాయింట్లతో ఆధిక్యతలో దూసుకెళ్లినా.. ఆ తర్వాత బీజ్‌ తేరుకొని టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. టై బ్రేక్‌లో సుమిత్‌ ఆ సెట్‌ను పోరాడి ఓడాడు. ఇక రెండో సెట్‌లో రెండు బ్రేక్‌ పాయింట్లను బ్రీజ్‌కు సుమిత్‌ కోల్పోవడంతో ఆ సెట్‌ కూడా చేజారింది. బ్రీజ్‌ క్లేకోర్ట్‌ స్పెషలిస్ట్‌ ఆటగాడు.

➡️