టెస్టులకు ఆండర్సన్‌ గుడ్‌బై..!

May 11,2024 22:57 #Sports

వెస్టిండీస్‌తో లార్డ్స్‌లో జరిగే టెస్ట్‌ చివరిదంటూ ప్రకటన
లార్డ్స్‌: ఇంగ్లండ్‌ సీనియర్‌ టెస్ట్‌ బౌలర్‌, 43ఏళ్ల జేమ్స్‌ ఆండర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది చివర్లో వెస్టిండీస్‌తో లార్డ్స్‌ వేదికగా జరిగే టెస్ట్‌ చివరిదంటూ ప్రకటించాడు. సోషల్‌ మీడియా వేదికగా ఆండర్సన్‌ తన రిటైర్మెంట్‌ ప్రకటనను వెల్లడించాడు. టెస్ట్‌ కెరీర్‌లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌ ఆండర్సన్‌ మాత్రమే. రిటైర్మెంట్‌ తర్వాత గోల్ఫ్‌ ఆడతాననిఆండర్సన్‌ తెలిపాడు. ‘తనకు మద్దతునిచ్చిన ఆటగాళ్లకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. 2003లో 22ఏళ్ల వయసులో లార్డ్స్‌లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన ఆండర్సన్‌… అదే వేదికపై 21ఏళ్ల తర్వాత క్రికెట్‌నుంచి వైదొలగనున్నాడు. 187టెస్టుల్లో 700వికెట్లు తీసిన ఆండర్సన్‌ 32సార్లు 5కు పైగా వికెట్లు కూల్చాడు. 194వన్డేల్లో 269వికెట్లు పడగొట్టాడు.

➡️