T20 World Cup 2024: శివాలెత్తిన సాల్ట్‌

Jun 20,2024 12:01 #Sports
  • వెస్టిండీస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ గెలుపు

సెయింట్‌ లూసియా: టి20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో ఇంగ్లండ్‌ జట్టు తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటింది. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌(87నాటౌట్‌; 47బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ జట్టు కేవలం 17.3 ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో(48నాటౌట్‌; 26బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) కూడా బ్యాటింగ్‌లో రాణించాడు. అంతకుముందు ఇంగ్లండ్‌ బౌలర్లు జోఫ్రా ఆర్చర్‌, అదిల్‌ రషీద్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. విండీస్‌ ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌, జాన్సన్‌ చార్లెస్‌లు రఫాడించారు. తొలి అయిదు ఓవర్లలో 40 పరుగులు జోడించారు. బ్రండన్‌ కింగ్‌ 23 పరుగులకు రిటైర్డ్‌ హార్ట్‌ కాగా, జాన్సన్‌ ఛార్లెస్‌ 38, పూరన్‌ 36, పావెల్‌ 36 పరుగులు చేసి ఔటయ్యారు. రూథర్‌ఫోర్డ్‌ 28 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో గ్రూప్‌-2లో ఇంగ్లండ్‌ తన పేరిట తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సాల్ట్‌కు దక్కింది.

స్కోర్‌బోర్డు..
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: కింగ్‌ (రిటైర్డ్‌ హార్ట్‌) 23, ఛార్లెస్‌ (సి)బ్రూక్‌ (బి)మొయిన్‌ 38, పూరన్‌ (సి)బట్లర్‌ (బి)ఆర్చర్‌ 36, రువన్‌ పావెల్‌ (సి)వుడ్‌ (బి)లివింగ్‌స్టోన్‌ 36, రస్సెల్‌ (సి)సాల్ట్‌ (బి)ఆదిల్‌ రషీద్‌ 1, రూథర్‌ఫోర్డ్‌ (నాటౌట్‌) 28, షెఫర్డ్‌ (నాటౌట్‌) 5, అదనం 13. (20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 180పరుగులు.
వికెట్ల పతనం: 1/94, 2/137, 3/141, 4/143
బౌలింగ్‌: టోప్లే 3-0-26-0, వుడ్‌ 3-0-36-0, ఆర్చర్‌ 4-0-34-1, సామ్‌ కర్రన్‌ 3-0-25-0, ఆదిల్‌ రషీద్‌ 4-0-21-1, మొయిన్‌ అలీ 2-0-15-1, లివింగ్‌స్టోన్‌ 1-0-20-1.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (నాటౌట్‌) 87, బట్లర్‌ (ఎల్‌బి)ఛార్లెస్‌ 25, మొయిన్‌ అలీ (సి)ఛార్లెస్‌ (బి)రస్సెల్‌ 13, బెయిర్‌స్టో (నాటౌట్‌) 48, అదనం 8. (17.3ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 181పరుగులు.
వికెట్ల పతనం: 1/67, 2/84
బౌలింగ్‌: హొసైన్‌ 4-0-35-0, షెఫర్డ్‌ 2-0-41-0, రస్సెల్‌ 2-0-21-1, జోసెఫ్‌ 2.3-0-32-0, మోంటీ 4-0-32-0, ఛేస్‌ 3-0-19-1.

➡️