IPL: ఐపిఎల్‌ నుంచి తప్పుకుంటున్నా: హ్యారీ బ్రూక్‌

Mar 13,2024 21:48 #Harry Brook, #IPL, #leaving, #Sports

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆటగాడు హారీ బ్రూక్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సీజన్‌ ఐపిఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, జో రూట్‌, జాసన్‌ రారు ఈ సీజన్‌ ఐపిఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోగా.. తాజాగా హ్యారీ బ్రూక్‌ ఆ జాబితాలో చేరాడు. వ్యక్తిగత కారణాలతో ఈ లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. దీంతో ఢిల్లీ ఫ్రాంచైజీ అతని స్థానంలో ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ను ఎంపిక చేసింది. బ్రూక్‌ను 2023 ఐపిఎల్‌ మినీ వేలంలో రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకోగా.. అంతకుముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ఏకంగా 14కోట్లు పెట్టి బ్రూక్‌ను కొనుగోలు చేసి భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి తెలిసిందే.

➡️