ఐసిసి టి20 సారథిగా సూర్యకుమార్‌

Jan 22,2024 15:46 #Cricket, #Sports
  • 2023 ఏడాదికి అత్యుత్తమ ఆటగాళ్లు వీరే..

దుబాయ్: టి20ల్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన ఆటగాళ్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) ప్రకటించింది. టాప్‌ ర్యాంకర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఆసీస్‌, దక్షిణాఫ్రికా జట్లతో టీ20 సిరీస్‌ల్లో భారత్‌ను సూర్య అద్భుతంగా నడిపించాడు. ఐసిసి జట్టులో భారత్‌ నుంచి మరో ముగ్గురికి స్థానం లభించింది. యువ సంచలనం యశస్వి జైస్వాల్‌, రవి బిష్ణోరు, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. గతేడాది సూర్యకుమార్‌ యాదవ్‌ 18మ్యాచుల్లో 733 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 15మ్యాచుల్లో 430 పరుగులు చేశాడు. ఇక రవి బిష్ణోరు ఆసీస్‌తో టి20 సిరీస్‌లో అదరగొట్టేసి ఐసిసి ర్యాంకింగ్స్‌లోను సత్తా చాడు. ఇక ఎడమ చేతివాటం పేసర్‌ ఆర్ష్‌దీప్‌ సింగ్‌ గత ఏడాది 21మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టి ఐసిసి అత్యుత్తమ ఆటగాళ్ల జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఐసిసి టి20 జట్టు: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, ఫిల్‌ సాల్ట్‌, నికోలస్‌ పూరన్‌, మార్క్‌ చాప్‌మన్‌, సికిందర్‌ రజా, రామ్‌జని, మార్క్‌ ఐదెర్‌, రవి బిష్ణోరు, రిచర్డ్‌ ఎన్‌గరవ, అర్ష్‌దీప్‌ సింగ్‌.

➡️