జ్యోతి సురేఖ బృందానికి స్వర్ణం

సియోల్‌(కొరియా): ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-2లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో జ్యోతి సురేఖ బృందం స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్‌ కౌర్‌, అదితి స్వామిలతో కూడిన మహిళల జట్టు 236-226పాయింట్ల తేడాతో టర్కీపై ఘన విజయం సాధించింది. కాంపౌండ్‌ విభాగంలో భారత ఆర్చరీ బృందం టాప్‌ ర్యాంక్‌లో ఉంది. ఇక మిక్స్‌డ్‌ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ-ప్రియాంశ్‌ బృందం ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత జంట 153-155పాయింట్ల తేడాతో అమెరికాకు చెందిన ఒలీవియా డీన్‌-సాయెర్‌ చేతిలో పరాజయాన్ని చవిచూశారు.

➡️