వాంఖడేలో కోల్‌కతా హవా

May 4,2024 07:36 #2024 ipl, #Cricket, #IPL, #kkr, #Sports
  •  ముంబయి ఇండియన్స్‌పై 24 పరుగుల తేడాతో గెలుపు
  •  స్టార్క్‌కు నాలుగు వికెట్లు

ముంబయి: వాంఖడే స్టేడియంలో కోల్‌కతా హవా కొనసాగింది. 57పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డా.. వెంకటేశ్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే రాణించడంతో 169 పరుగులు చేసింది. అనంతరం ముంబయిని 18.5ఓవర్లలో 145పరుగులకే ఆలౌట్‌ చేసి 24పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్లకు సహకరించిన వాంఖడే స్టేడియంలో తొలుత ముంబయి బౌలర్లు చెలరేగారు. టాపార్డర్‌ బ్యాటర్లను తుషార కూల్చగా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్ల పని జస్ప్రీత్‌ బుమ్రా పని పట్టాడు. కోల్‌కతా పవర్‌ ప్లే ముగిసేలోపే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఏడో ఓవర్‌లో ఐదో వికెట్‌ను కూడా చేజార్చుకొని మరింత కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌(70), మనీశ్‌ పాండే(42) ఆదుకున్నారు. వెంకటేశ్‌ అయ్యర్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా.. మనీష్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆండ్రూ రస్సెల్‌ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రనౌట్‌ అయి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బుమ్రా మరింత రెచ్చిపోయి బౌలింగ్‌ చేశాడు. దీంఓ కోల్‌కతా వరుస వికెట్లను చేజార్చుకుంటూ ఆలౌటయింది. తుషారా వేసిన తొలి ఓవర్‌లో నాలుగో బంతికి ఫిలిప్‌ సాల్ట్‌ (5) తిలక్‌వర్మకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మూడో ఓవర్‌లో రెండో బంతికి రఘువంశీ (13) కూడా క్యాచ్‌ ఔటవ్వగా.. చివరి బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ (6) కూడా ఔటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా వేసిన ఐదో ఓవర్‌లో రెండో బంతికి నరైన్‌ (8) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఏడో ఓవర్‌లో తొలి బంతికే రింకు (9) పీయూష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. టాపార్డర్‌ విఫలమైన వేళ క్రీజులోకి వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ (70), మనీశ్‌ పాండే (42) విజంభించారు. వీళ్లిద్దరూ కలిసి జట్టుకు కీలక స్కోర్‌ను అందించారు. కానీ 17వ ఓవర్‌లో కోల్‌కతాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. హార్దిక్‌ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో రెండు వికెట్లను కోల్‌కతా కోల్పోయింది. మూడో బంతికి మనీశ్‌ పాండే బ్రెవిస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. చివరి బంతికి పరుగు తీసే క్రమంలో రసెల్‌ (7) రనౌట్‌ అయ్యాడు. బుమ్రా వేసిన 18వ ఓవర్‌లోనూ రెండు వికెట్లు పడ్డాయి. ఈ ఓవర్‌లో నాలుగో బంతికి రమణ్‌దీప్‌ (2) క్యాచ్‌ ఔటవ్వగా.. స్టార్క్‌ (0) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇక 19.5 ఓవర్ల వద్ద వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా ఔటయ్యాడు. దీంతో కోల్‌కతా 19.5ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ముంబయి కష్టాలతోనే ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. సూర్యకుమార్‌(56), టిమ్‌ డేవిడ్‌(24) మాత్రమే రాణించారు. స్టార్క్‌ చివర్లో వరుసగా మూడు వికెట్లు తీసి కోల్‌కతా గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
స్కోర్‌బోర్డు..
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి)తిలక్‌ వర్మ (బి)తుషార 5, నరైన్‌ (బి)హార్దిక్‌ 8, రఘువంశీ (సి)సూర్యకుమార్‌ (బి)తుషార 13, శ్రేయస్‌ (సి)టిమ్‌ డేవిడ్‌ (బి)తుషార 6, వెంకటేశ్‌ అయ్యర్‌ (బి)బుమ్రా 70, రింకు సింగ్‌ (సి అండ్‌ బి)చావ్లా 9, మనీష్‌ పాండే (సి)బ్రెవీస్‌ (బి)హార్దిక్‌ పాండ్యా 42, రస్సెల్‌ (రనౌట్‌) తుషార/హార్దిక్‌ 7, రమణ్‌దీప్‌ సింగ్‌ (సి)కొర్ట్జే (బి)బుమ్రా 2, మిఛెల్‌ స్టార్క (బి)బుమ్రా 0, వైభవ్‌ అరోరా (నాటౌట్‌) 0, అదనం 7. (19.5ఓవర్లలో ఆలౌట్‌) 169పరుగులు. వికెట్ల పతనం: 1/7, 2/22, 3/28, 4/43, 5/57, 6/140, 7/153, 8/155, 9/155, 10/169 బౌలింగ్‌: తుషార 4-0-42-3, బుమ్రా 3.5-18-3, కొర్ట్జే 2-0-24-0, హార్దిక్‌ 4-0-44-2, నమన్‌ 3-0-25-0, చావ్లా 3-0-15-1.
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (బి)స్టార్క్‌ 13, రోహిత్‌ శర్మ (సి)మనీష్‌ పాండే (బి)నరైన్‌ 11, నమన్‌ ధీర్‌ (బి)చక్రవర్తి 11, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) సాల్ట్‌ (బి)రస్సెల్‌ 56, తిలక్‌ వర్మ (సి)నరైన్‌ (బి)చక్రవర్తి 4, వథేరా (బి)నరైన్‌ 6, హార్దిక్‌ పాండే (సి)మనీష్‌ పాండే (బి)రస్సెల్‌ 1, టిమ్‌ డేవిడ్‌ (సి)శ్రేయస్‌ (బి)స్టార్క్‌ 24, కోర్ట్జే (బి)స్టార్క్‌ 8, పియూష్‌ చావ్లా (సి)నరైన్‌ (బి)స్టార్క్‌ 0, బుమ్రా (నాటౌట్‌) 1, అదనం 10. (18.5 ఓవర్లలో ఆలౌట్‌) 145పరుగులు వికెట్ల పతనం: 1/16, 2/38, 3/46, 4/61, 5/70, 6/71, 7/120, 8/144, 144/9, 10/145 బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 3-0-35-0, స్టార్క్‌ 3.5-0-33-4, చక్రవర్తి 4-0-22-2, నరైన్‌ 4-0-22-2, రస్సెల్‌ 4-0-30-2.

➡️