లక్నోకు ఢిల్లీ ఝలక్‌

Apr 13,2024 07:44 #Sports

ఢిల్లీ క్యాపిటల్స్‌ లక్ష్యం 168పరుగులు
లక్నో: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో తొలిసారి ఢిల్లీ బౌలర్లు చెలరేగారు. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌(3/20)కి తోడు ఖలీల్‌ అహ్మద్‌(2/41) రాణించడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167పరుగులకే పరిమితమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. డేంజరస్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(19)ను ఖలీల్‌ అహ్మద్‌ ఎల్బీగా వెనక్కి పంపాడు. 28 పరుగులు వద్ద లక్నో తొలి వికెట్‌ పడిన లక్నోను ఖలీల్‌ మళ్లీ దెబ్బకొట్టాడు. క్రీజులో కుదురుకుంటున్న దేవ్‌దత్‌ పడిక్కల్‌(13)ను ఎల్బీగా దొరకబుచ్చుకున్నాడు. ్టల్లోకి నెట్టాడు. దాంతో, లక్నో జట్టు 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తఆ తర్వాత రాహుల్‌, స్టోయినిస్‌తో ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేసినా.. చైనామన్‌ కుల్దీప్‌ వరుస బంతుల్లో మార్కస్‌ స్టోయినిస్‌(8), నికోలస్‌ పూరన్‌(0)లను ఔట్‌ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో కేఎల్‌ రాహుల్‌(39)ను పెవిలియన్‌ పంపి లక్నోను పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఇషాంత్‌ శర్మ ఓవర్లో దీపక్‌ హుడా(10) వెనుదిరిగాడు. కృణాల్‌ పాండ్యా కూడా రాశపరచడంతో లక్నో జట్టు 94పరుగులకే 7వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో ఆయుష్‌ బడోని(65)మెరుపు అర్ధసెంచరీకి తోడు ఆర్షాద్‌ ఖాన్‌(20నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా ఢిల్లీని ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు అజేయంగా 73పరుగులు జతచేసి ఢిల్లీ గౌరవప్రద స్కోర్‌ చేసేందుకు దోహదపడ్డారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌కు మూడు, ఖలీల్‌ అహ్మద్‌కు రెండు, ఇషాంత్‌, ముఖేశ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.
స్కోర్‌బోర్డు..
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (ఎల్‌బి)ఖలీల్‌ అహ్మద్‌ 19, కెఎల్‌ రాహుల్‌ (సి)పంత్‌ (బి)కుల్దీప్‌ 33, దేవదత్‌ పడిక్కల్‌ (ఎల్‌బి)ఖలీల్‌ అహ్మద్‌ 3, స్టొయినీస్‌ (సి)ఇషాంత్‌ (బి)కుల్దీప్‌ 8, పూరన్‌ (బి)కుల్దీప్‌ యాదవ్‌ 0, దీపక్‌ హుడా (సి)వార్నర్‌ (బి)ఇషాంత్‌ 10, ఆయుష్‌ బడోని (నాటౌట్‌) 55, కృణాల్‌ పాండ్యా (సి)పంత్‌ (బి)ముఖేశ్‌ కుమార్‌ 3, ఆర్షాద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 20, అదనం 10. (20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 167పరుగులు.
వికెట్ల పతనం: 1/28, 2/41, 66/3, 4/66, 5/77 6/89 7/94
బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-41-2, ఇషాంత్‌ శర్మ 4-0-36-1, ముఖేశ్‌ కుమార్‌ 4-0-41-1, అక్షర్‌ పటేల్‌ 4-0-26-0, కుల్దీప్‌ యాదవ్‌ 4-0-20-3,

➡️