ఫిలిప్స్‌ అర్ధసెంచరీ

nz bag match

న్యూజిలాండ్‌కు ఆధిక్యత

ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో, చివరి టెస్ట్‌లో న్యూజిలాండ్‌ జట్టు 8పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతను సాధించింది. ఐదు వికెట్ల నష్టానికి 55పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్‌ జట్టును గ్లెన్‌ ఫిలిప్స్‌(88) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. మిఛెల్‌(18), జేమీసన్‌(20), కెప్టెన్‌ సోథీ(14)ల సాయంతో ఫిలిప్స్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. దీంతో న్యూజిలాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 180పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్‌ బౌలర్లు మెహిదీ హసన్‌, తైజుల్‌ ఇస్లామ్‌కు మూడేసి, షోరిఫుల్‌ ఇస్లామ్‌, నయామ్‌ హసన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆరంభించిన బంగ్లాదేశ్‌ జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 2వికెట్ల నష్టానికి 38పరుగులు చేసింది. మహ్మదుల్లా(2), నజ్ముల్‌(15) త్వరగా పెవీలియన్‌కు చేరినా.. జాకిర్‌(16), మోమినుల్‌ హక్‌(0) క్రీజ్‌లో ఉన్నారు. దీంతో బంగ్లాదేశ్‌కు 30 పరుగుల ఆధిక్యత లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 172పరుగులు చేసిన విషయం తెలిసిందే.

➡️