నిషాకు ఒలింపిక్‌ బెర్త్‌

May 11,2024 21:52 #Sports

ఇస్తాంబుల్‌: మహిళా రెజ్లర్‌ నిషా దహియాకు ఒలింపిక్‌ బెర్త్‌ దక్కింది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ రెజ్లింగ్‌ పోటీల్లో నిషా దహియా సెమీస్‌కు చేరింది. శనివారం జరిగిన 68కిలోల విభాగం క్వార్టర్‌ఫైనల్లో నిషా రొమేనియాకు చెందిన అలెగ్జాండ్రా అంగెల్‌ను చిత్తుచేసింది. హోరాహోరీ పోరులో నిషా 8-4పాయింట్ల తేడాతో ప్రత్యర్ధిని చిత్తుచేసింది. ఈ పోటీల్లో నిషా తొలి పిరీయడ్‌లోనే 8-0పాయింట్ల ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రెండు పాయింట్లు, మరో దఫా మరో రెండు పాయింట్లను ప్రత్యర్ధికి సమర్పించుకొంది. యూరోపియన్‌, అండర్‌23 ప్రపంచ రెజ్లింగ్‌ పోటీల్లో రజత పతకం సాధించిన నిషా చివర్లో ప్రత్యర్ధి దాడులను సమర్ధవంతంగా నిలువరించి మ్యాచ్‌ను ముగించింది. ప్రి క్వార్టర్స్‌లో బెలారస్‌ టీనేజర్‌ అలీనాపై 3-0పాయింట్లతో నెగ్గి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌కు చేరిన రెజ్లర్లకు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లు దక్కనున్నాయి. దీంతో పారిస్‌ ఒలింపిక్స్‌-2024 అర్హత సాధించిన ఐదో భారత మహిళా రెజ్లర్‌గా నిషా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నిషా 58వ స్థానంలో ఉండగా.. సెమీస్‌లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన 9వ ర్యాంకర్‌ అడెలా హాంజ్లికోవాతో తలపడనుంది. హాండ్లీకోవా 7-4పాయింట్ల తేడాతో ఏంజెలోను చిత్తుచేసి సెమీస్‌కు చేరింది.

➡️