శ్రీలంక బౌలింగ్‌ కోచ్‌గా పాకిస్తాన్‌ దిగ్గజం..

Mar 16,2024 16:48 #Cricket, #Pakistan, #sril

శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ ఆకిబ్‌ జావేద్‌ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా, విండీస్‌ వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ వరకు జావేద్‌ తన పదవిలో కొనసాగనున్నాడు. ఈ మెర​కు శ్రీలంక క్రికెట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.”పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావేద్‌ను మా జాతీయ జట్టు ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించడం జరిగింది. అతడు టీ20 వరల్డ్‌‍కప్‌-2024 పూర్తి అయ్యేంతవరకు జట్టుతో కలిసి పనిచేస్తాడు శ్రీలంక క్రికెట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. బౌలర్ ఆకిబ్ జావేద్‌ పాకిస్తాన్‌ తరపున 163, 22 వన్డేలు, టెస్టులు ఆడిన జావేద్‌ .. వరుసగా 182, 54 వికెట్లు పడగొట్టాడు. 1992 వన్డే వరల్డ్‌కప్‌ గెలుచుకున్న పాక్‌ జట్టులో జావేద్‌ సభ్యునిగా ఉన్నాడు.

➡️