ఒలింపిక్స్‌కు సబలెంక, జబీర్‌ దూరం

Jun 18,2024 22:58 #Sports

పారిస్‌: ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం లేదని ఆర్యానా సబలెంకా, అన్‌ జబీర్‌ ప్రకటించారు. ఆరోగ్య కారణాల రీత్యా ఒలింపిక్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వీరిద్దరూ మంగళవారం వెల్లడించారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఛాంపియన్‌ అయిన సబలెంక.. రెండుసార్లు వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ రన్నరప్‌ కూడాను. ప్రపంచ 3వ ర్యాంకర్‌ అయిన బెలారస్‌కు చెందిన సబలెంకా.. వరుసగా మేజర్‌ టోర్నీల్లో పాల్గనడంతో ఆరోగ్యం క్షీణిస్తుందన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ట్యునీషియాకు చెందిన అన్స్‌ జబీర్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌పై దృష్టి సారించాలని నిర్ణయిం తీసుకున్నారు. అన్స్‌ జబీర్‌ గత మూడు ఒలింపిక్స్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా గెలుపొందలేదు.

➡️