హర్మన్‌ప్రీత్‌కు పగ్గాలు

Jun 26,2024 23:00 #Sports

నాల్గోసారి ఒలింపిక్స్‌లో ఆడనున్న శ్రీజేశ్‌, మన్‌ప్రీత్‌
పారిస్‌ ఒలింపిక్స్‌కు జట్టును ప్రకటించిన హాకీ ఇండియా
బెంగళూరు: పారిస్‌ ఒలింపిక్స్‌కు హాకీ ఇండియా(హెచ్‌ఐ) పురుషుల జట్టును ప్రకటించింది. 19మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేయగా.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ వ్యవహరించనున్నాడు. సీనియర్‌ ఆటగాళ్లు పిఆర్‌ శ్రీజేష్‌, మన్‌ప్రీత్‌సింగ్‌లతో పాటు పలువురు స్టార్‌ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌, మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌లకు ఇది నాలుగో ఒలింపిక్స్‌ కావడం విశేషం. ఇక రిజర్వ్‌ ఆటగాళ్లుగా నీలకంఠ శర్మ, జుగ్రాజ్‌ సింగ్‌, కృష్ణన్‌ బహదూర్‌లను ఎంపికయ్యారు. విశ్వక్రీడలకు భారత బృందం ఎంపికపై భారీ కసరత్తు చేశామని హెడ్‌కోచ్‌ క్రెగ్‌ ఫల్టన్‌ తెలిపాడు. ‘పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం టీమిండియా స్క్వాడ్‌ ఎంపిక కోసం చాలా కష్టపడ్డాం. చాలామంది నైపుణ్యంగల ఆటగాళ్లే కావడమే ఇందుకు కారణం. స్క్వాడ్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ అత్యుత్తమ ఆట ఆడుతారనే నమ్మకం నాకుంది’ అని క్రెగ్‌ తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. జూలైలో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్‌ బృందం పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
గోల్‌ కీపర్‌ : శ్రీజేష్‌ పరట్టు రవీంద్రన్‌.
డిఫెండర్లు : జర్మన్‌ప్రీత్‌ సింగ్‌, అమిత్‌ రొహిదాస్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌(కెప్టెన్‌), సుమిత్‌, సంజరు.
మిడ్‌ఫీల్డర్లు : రాజ్‌కుమార్‌ పాల్‌, శంషేర్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌.
ఫార్వర్డ్స్‌ : అభిషేక్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌, లలిత్‌ కుమార్‌ ఉపాధ్యారు, మన్‌దీప్‌ సింగ్‌, గుర్జంట్‌ సింగ్‌.
రిజర్వు: నీలకంఠ శర్మ, జుగ్రాజ్‌ సింగ్‌, కృష్ణన్‌ బహదూర్‌ పాఠక్‌.

➡️