షమీకి శస్త్రచికిత్స విజయవంతం

Feb 27,2024 10:52 #BCCI, #Cricketer, #shami

స్టార్‌ క్రికెటర్‌ మహ్మద్‌ షమీ ఆసుపత్రిలో చేరారు. గతేడాది వన్డే వరల్డ్‌ కప్‌లో షమీ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన క్రికెట్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో షమీకి తాజాగా ఆపరేషన్‌ జరిగింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. ‘మడమ ఆపరేషన్‌ విజయవంతంగా జరిగింది. కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. నా కాళ్లపై నేను నడిచి రావడానికి ఎదురుచూస్తుంటాను’ అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ పెట్టాడు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను కూడా షేర్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు షమీ త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

➡️